ప్రధాని మోదీపై నార్వే మీడియా వివాదాస్పద కార్టూన్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటన వివాదాలకు దారి తీసింది. పర్యటన అంతా సవ్యంగా సాగినప్పటికీ.. చివర్లో ఆ దేశ ప్రధాని జోనాస్ గాహ్ర్ స్టోర్స్‌తో కలిసి నిర్వహించిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్.. దీనికి కేంద్రబిందువు అయింది. నార్వేజియన్ జర్నలిస్ట్ హెల్లె లింగ్ సంధించిన ప్రశ్నకు మోదీ బదులు ఇవ్వకపోవడంతో ఈ వివాదం చెలరేగింది. భారత్ లో పత్రికా స్వేచ్ఛ, మానవ హక్కులు అణచివేతకు గురి అవుతున్నాయంటూ ఆమె అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానం ఇవ్వలేదు.

దీన్ని హెల్లె లింగ్ రికార్డు చేసి తన ఎక్స్‌లో పోస్ట్ చేయగా, అది వైరల్‌ అయింది. అంతర్జాతీయ స్థాయిలో డిబేట్స్ కు దారితీసింది. భారత్ లో మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛపై ఆందోళనలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి. ఇది అక్కడితో ఆగలేదు. నార్వేలో మరింత దుమారం రేపుతోందా అంశం. ప్రధాని మోదీ, భారత్ లో చోటు చేసుకుంటోన్న పరిణామాల పట్ల అక్కడి మీడియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. మోదీ జావాబివ్వకపోవడం అక్కడి మీడియా హెడ్ లైన్ లల్లో నిలుస్తోంది.

Controversy Over Racist Cartoon Portraying Modi as a Snake Charmer Sparks Western Stereotype Outcry

ఈ క్రమంలో నార్వే చెందిన ఒక వార్తాపత్రిక ప్రధాని మోదీని పాములు పట్టేవాడిలా వర్ణిస్తూ ఓ కార్టూన్ ను ప్రచురించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 'ఆఫ్టెన్‌పోస్టెన్' అనే ఆ పత్రిక అది. మోదీని పాములు పట్టే వాడిగా చిత్రీకరించింది. ఆయన బూర ఊదుతోండగా.. పెట్రోల్ గన్ ఆకారంలో ఉన్న పాము బుట్టలో నుంచి బయటికి వచ్చి తల ఆడిస్తోన్నట్లుగా ఈ కార్టూన్ ను ప్రచురిచిందా మీడియా హౌస్.

మార్విన్ హల్లెరాకెర్ దీన్ని గీశారు. ఎ స్నేకీ అండ్ స్లైట్లీ అన్నోయింగ్ మ్యాన్.. అనే క్యాప్షన్ దీనిపై కనిపించింది. ఇదొక ఒపీనియన్ ఆర్టికల్. ఫ్రాంక్ రొస్సావిక్ దీన్ని రాశారు. ఈ కార్టూన్.. రెండు దేశాల్లోనూ వివాదాలను రాజేసినట్టయింది. చాలామంది ఇంటర్నెట్‌లో దీన్ని స్పష్టమైన జాతివివక్షగా అభివర్ణిస్తోన్నారు. భారత్ ను నార్వే పాములు పట్టే వాళ్ల దేశంగా కించపరిచిందంటూ మండిపడుతున్నారు. ఈ కార్టూన్ జెనోఫోబిక్ అని చెబుతున్నారు. భారత్, దేశ ప్రధాని అగౌరవకరమని యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు.

"ఈ కార్టూన్ స్పష్టంగా జాతివివక్షతో కూడుకుందని, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకప్పుడు భారత్ ను 'పాములు పట్టే వాళ్ల దేశం'గా భావించేవని, అదే ధోరణిని ఇప్పుడూ కనపర్చుతున్నాయని ఓ యూజర్ వ్యాఖ్యానించాడు. యూరోపియన్లు ఇంకా తమ వలసవాద భావాల నుండి ఇప్పటికీ బయటపడలేకపోతున్నారని మరో నెటిజన్ కామెంట్ చేశారు. పాశ్చాత్య దేశాల మీడియాలో వలసవాద అహంకారం ఇంకా సజీవంగా ఉందంటూ మండిపడుతున్నారు. దీనిపై ఇండియా టుడే ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+