అమర్‌నాథ్ ర్యాలీలో లాఠీఛార్జి
జమ్ము: అమర్‌నాథ్‌లోని భూవివాదం ఓ కొలిక్కి రావడంతో అమర్‌నాథ్ దేవస్థానం బోర్డు నిర్వహించిన విజయ ర్యాలీలో పాల్గొనడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ర్యాలీపై ఉగ్రవాదులు దాడి చేయవచ్చన్న సమాచారంతో పోలీసులు కర్ఫ్యూ విధించినా, ప్రజలు దాన్ని లెక్కచేయలేదు. పెద్దసంఖ్యలో వీధుల్లోకి వచ్చిన ప్రజలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపైకి వారు రాళ్లు రువ్వారు. అల్లరిమూకలను అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జి చేశారు.
అమర్‌నాథ్ భూముల కేటాయింపుపై నెల రోజులుగా నిర్వహిస్తున్న ఆందోళనను అమర్‌నాథ్ సంఘర్షణ సమితి విరమణకు ఒప్పుకుంది. యాత్ర జరిగే మూడు నెలల పాటు తాత్కాలికంగా ఆలయ బోర్డుకు 100 ఎకరాల భూమిని యాత్రీకుల సౌకర్యం ఇవ్వడానికి కేంద్రం చేసిన ప్రతిపాదనకు సమితి అంగీకరించింది. ఈ మేరకు శనివారం అర్ధ రాత్రి జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయి. ఈ రోజు ఆందోళన విరమణ అంశాన్ని సమితి అధికారికంగా ప్రకటిస్తుంది.












Click it and Unblock the Notifications