వలసల బ్రేక్ కు చంద్రబాబు కసరత్తు
హైదరాబాద్: పార్టీ నుంచి వలసలను ఆపేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. నల్లగొండ జిల్లాకు చెందిన నాయకులు సుఖేందర్ రెడ్డి, కటికం సత్తయ్యగౌడ్ లను ఆయన ఆదివారం పార్టీ కార్యాలయానికి పిలిపించి వారితో మాట్లాడారు. ఈ ఇద్దరు నాయకులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరుతారనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వారితో చంద్రబాబు మాట్లాడారు. సుఖేందర్ రెడ్డి చాలా కాలంగా అసమ్మతితో ఉన్న విషయం తెలిసిందే.
అయితే తాము చిరంజీవి పార్టీలో చేరబోమని సుఖేందర్ రెడ్డి, సత్తయ్యగౌడ్ స్పష్టం చేశారు. తమ పార్టీ నుంచి ఒక్కరొక్కరే రాజీనామా చేసి చిరంజీవి పార్టీ వైపు వెళ్తున్న నేపథ్యంలో చంద్రబాబు నష్టనివారణ చర్యలకు పూనుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తమ్మినేని సీతారాం కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి పార్టీలో చేరుతారనే వార్తలు వెలువడుతున్నాయి.












Click it and Unblock the Notifications