మేం వస్తే ఎస్టీల్లో బోయలు: బాబు
హైదరాబాద్: తమ పార్టీ అధికారంలోకి వస్తే వాల్మీకి బోయలను ఎస్‌టీ జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. వాల్మీకి కులస్థులను ఎస్‌టీ జాబితాలో చేర్చే పోరాటంలో తమకు మద్దతు ఇవ్వాలని అనంతపురం జిల్లా నుంచి వచ్చిన బోయ కులస్థులు చంద్రబాబును ఆయన నివాసంలో కలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో టికెట్ ఇచ్చి బోయ కులస్థులను ప్రోత్సహిస్తోందని చంద్రబాబు చెప్పారు. ఈ విషయాన్ని తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేరుస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications