బిజెపి సంకల్ప యాత్ర: దత్తాత్రేయ
హైదరాబాద్: ఎరువుల కర్మాగారాలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎత్తివేయడం వల్లే రాష్ట్రంలో ఎరువులకు కొరత ఏర్పడిందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) విమర్శించింది. ఉన్న కొద్ది ఎరువులనూ కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలోని సింగిల్‌విండోలకు అప్పగించడం వల్ల అవి బ్లాక్‌మార్కెట్‌కు తరలుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవకాశవాద రాజకీయాలను ప్రజలకు వివరించేందుకు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 10 వరకు రాష్ట్రంలో సంకల్ప్ యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
కరీంనగర్, మహబూబ్‌నగర్, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల నుంచి నాలుగు యాత్రలు చేపట్టనున్నట్లు వివరించారు. తెలంగాణలో జరిగే యాత్రలను తెలంగాణా ఆత్మగౌరవ యాత్రలని పిలుస్తామని దత్తాత్రేయ చెప్పారు. ఈ యాత్ర ముగిసిన వారంరోజుల లోపే రాష్ట్రంలో అద్వానీ విజయ్ సంకల్ప్ యాత్ర సాగుతుందని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications