ఆరోగ్యశ్రీ వర్తింపజేయండి: పోలీసులు
హైదరాబాద్: వేతనాలకు సంబంధించి రంగాచారి కమిషన్‌లో తమకు అన్యాయం జరిగిందని పోలీసు అధికారుల సంఘం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి ఫిర్యాదు చేసింది. వెయిటేజ్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని సంఘం ప్రతినిధులు కోరారు. పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు.
పోలీసు తల్లిదండ్రులకూ ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి సానుకూలంగా విన్నారని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి రాంనర్సింహారెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications