రాజకీయాల్లోంచి తప్పుకుంటా: షబ్బీర్
న్యూఢిల్లీ: ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినట్లయితే తాను రాజకీయాల్లోంచి తప్పుకుంటానని రాష్ట్ర విద్యుచ్ఛక్తి మంత్రి షబ్బీర్ అలీ సవాల్ చేశారు. ముస్లింల కోసం చేపట్టిన కార్యక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన విమర్శకు ప్రతిస్పందిస్తూ ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ సవాల్ విసిరారు. తాము ముస్లింలకు రాజకీయాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన చెప్పారు.
తాము ముస్లింల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై తెలుగుదేశం పార్టీతో బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఆయన చెప్పారు. బహిరంగ చర్చకు స్థలం, తేదీ, సమయం ఖరారు చేయాలని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులకు సూచించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లోనైనా తాను బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications