గిరిజన ప్రాంతాల్లో విజయశాంతి
వరంగల్: వరంగల్ జిల్లాలోని గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో తల్లి తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు విజయశాంతి ఆదివారంనాడు పర్యటించారు. విషజ్వరాలతో మరణించినవారి కుటుంబాలను, విషజ్వరాలతో బాధపడుతున్నవారిని ఆమె పరామర్శించారు. విషజ్వరాలతో మరణించినవారి కుటుంబాలకు ఆమె ఐదేసి వేల రూపాయల సహాయం అందజేశారు.
వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం, ములుగు గిరిజన తండాల్లో ఆమె పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మొక్కుబడి మాత్రమేనని, ప్రభుత్వానివన్నీ మాటలేనని, చేతలు శూన్యమని ఆమె విమర్శించారు. ఈ పర్యటనలో విజయశాంతి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.












Click it and Unblock the Notifications