చిరు పార్టీపై 3న చర్చిస్తాం: ఏచూరి
రాజమండ్రి: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై సెప్టెంబరు 3న జరిగే సమావేశంలో చర్చిస్తామని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి తెలిపారు. చిరంజీవి పార్టీపై ఇప్పటి వరకు తాము చర్చించలేదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. చిరంజీవి పార్టీతో పొత్తుల విషయమై రాష్ట్ర కమిటీయే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సింగూరు సమస్యపై కాంగ్రెస్, తృణమూల్‌లే సమాధానం చెప్పాలన్నారు. తాము ఏర్పాటు చేయబోయే తృతీయ కూటమి జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications