ఎన్టీ ఆర్ కు బాబు వెన్నుపోటు: వైయస్
ఖమ్మం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్వర్గీయ ఎన్ టి రామారావుకు, ఎన్టీఆర్ పథకాలకు వెన్నుపోటు పొడిచారని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఆయన ఆదివారం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఖమ్మం జిల్లాకు ఆయన ఈ సందర్భంగా వరాల వర్షం కురిపించారు. ఖమ్మం జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
అవగాహన లేనివారే ఆరోగ్యశ్రీ పథకాన్ని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వం ప్రజల కోసం ఏమీ చేయలేదని ఆయన అన్నారు. తాము ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనకు పిడిఎస్ యు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు 17 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications