అవసరాలను బట్టే చిరు పొత్తులు
హైదరాబాద్: తమ నేత చిరంజీవి ప్రజల్లోకి వెళ్లాక రాజకీయావసరాలను బట్టే ఎన్నికల్లో పొత్తులుంటాయని ప్రజారాజ్యం అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా చెప్పారు. చిరంజీవి రాష్ట్ర పర్యటన త్వరలో ప్రారంభమవుతుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ పర్యటనకు సంబంధించి పది రోజుల్లో కమిటీలు వేయనున్నట్లు ఆయన తెలిపారు. దాదాపు మూడు నెలల పాటు చిరంజీవి రాష్ట్రంలో పర్యటిస్తారని ఆయన చెప్పారు.
నక్సలిజం సామాజిక, ఆర్థికపరమైన సమస్య అని ఆయన అన్నారు. పేదరికం సృష్టించిన సమస్యల్లో నక్సలిజం ఒక్కటని ఆయన అన్నారు. ప్రపంచబ్యాంక్ విధానాలపై తమ వైఖరిని ఒక్క మాటలో చెప్పడం సాధ్యం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications