వైయస్ చేతకాని సిఎం: చంద్రబాబు

పేద రైతులు ప్రైవేట్ రుణాలు తీసుకున్నారని, రుణమాఫీ వల్ల వారికి మేలు జరగడం లేదని ఆయన అన్నారు. సహకార రుణాల విషయంలో 2,500 కోట్ల రూపాయలు బుక్ అడ్జస్ట్ మెంట్ చేశారని, దీనివల్ల రాష్ట్ర రైతులకు నష్టం జరిగిందని ఆయన అన్నారు. రైతులకు ఐదు వేల రూపాయల బిచ్చమేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బిసిలంటే కాంగ్రెసుకు చిన్నచూపు అని, బిసిల రుణాల మాఫీలో కూడా సరైన న్యాయం జరగడం లేదని ఆయన అన్నారు. చేనేత కార్మికుల రుణాల రద్దుకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కేంద్రాన్ని కోరారని, అయితే కేంద్ర ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదని ఆయన అన్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications