చిరంజీవితో కలిసి నడిచే మిత్రులు

సోమవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో చిరంజీవి పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంపై జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని లోక్ సత్తా చర్చించింది. నిజాయితీతో కూడిన రాజకీయాలతో ముందుకు వచ్చే వారితో పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. మౌలిక భావజాలానికి భంగకరం కాకుండా కొత్త రాజకీయానికి దోహదపడే పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీ ఒక అభిప్రాయానికి వచ్చింది. అయితే నవంబరులో సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాకే పొత్తుల గురించి ఆలోచించాలని పార్టీ నిర్ణయించింది.
కాగా, చిరంజీవి ప్రజారాజ్యంతో పొత్తు విషయమై సిపిఎం ఈ నెల 3వ తేదీన చర్చించనుంది. మొదటి నుంచి చిరంజీవి వామపక్షాలతో కలిసి పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలా, చిరంజీవితో కలిసి నడవాలా అనే విషయంపై సిపిఎం ఈ నెల 3వ తేదీ సమావేశం చర్చించే అవకాశం ఉంది. కాగా, సిపిఐ మొదటి నుంచి చిరంజీవికి అనుకూలంగానే ప్రతిస్పందిస్తూ వస్తున్నది. తెలుగుదేశం, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా మూడో ప్రత్యామ్నాయాన్ని ప్రోత్సహించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే చిరంజీవి ప్రజారాజ్యంతో ఆ పార్టీ కలిసి పనిచేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications