నలుగురు సిమి కార్యకర్తల అరెస్టు
జైపూర్: రాజస్థాన్ లోని కోటాలో నలుగురు సిమి కార్యకర్తలను అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారంనాడు చెప్పారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు ఈ అరెస్టులు చేసింది. అరెస్టయిన వారిలో సిమీ కోర్ గ్రూప్ చీఫ్ కూడా ఉన్నాడు. కోర్ గ్రూప్ చీఫ్ మున్వర్ హుస్సేన్ తో పాటు నలుగురిని అరెస్టు చేసినట్లు అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ ఎ.కె. జైన్ చెప్పారు.
కోటాలో హుస్సేన్ కు టైలరింగ్ షాపు ఉన్నట్లు ఆయన తెలిపారు. మిగతా ముగ్గురిని అతిక్ అలియాస్ అథ్ - ఉర్ - రెహ్మాన్, నదీం అక్తర్, మొహమ్మద్ ఇలియాస్ లుగా గుర్తించారు. మొదటి ఇద్దరు కోటాకు చెందినవారు కాగా, మూడో వ్యక్తి బారన్ జిల్లాకు చెందినవాడు. వారిని పోలీసులు కోర్టు హాజరు పరిచారు. వారిని 11 రోజుల పాటు రిమాండ్ కు పంపుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జైపూర్ పేలుళ్ల కేసులో వారిని అరెస్టు చేయలేదని, జులై 26వ తేదీన జరిగిన అహ్మదాబాద్ పేలుళ్లలో కీలక పాత్ర పోషించిన సిమి కార్యకర్త సాజిద్ మన్సూరీతో సంబంధాలు ఉండడం వల్లనే అరెస్టు చేశామని జైన్ చెప్పారు.












Click it and Unblock the Notifications