సోనియాతో మందకృష్ణ భేటీ
న్యూఢిల్లీ: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగ మంగళవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టరూపం ఇవ్వడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన సోనియా గాంధీని కోరారు. ఆయనతో పాటు పార్లమెంటు సభ్యులు నంది ఎల్లయ్య, మంద జగన్నాథం సోనియాను కలిశారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని కృష్ణ సోనియాకు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై ఈ నెలాఖరులో తేలిపోతుందని రాష్ట్ర మంత్రి మారెప్ప హైదరాబాదులో అన్నారు. కాంగ్రెసుకు దగ్గరైన మందకృష్ణ మాదిగ చిరంజీవిపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications