ఏ కూటమిలోనూ చేరం: చిరు ప్రతినిధులు

Chiranjeevi
హైదరాబాద్: తాము ఏ కూటమిలోనూ చేరబోమని చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధులు డాక్టర్ మిత్రా, పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. వామపక్షాలపై పొత్తుల కోసం ప్రజారాజ్యం పార్టీ ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో వారు ఈ ప్రకటన చేశారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని వారు గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. మూడో కూటమి ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నిస్తే మాత్రం వారు నేరుగా బదులివ్వలేదు. ప్రతి ఓటు, ప్రతి సీటు సాధించడమే తమ లక్ష్యమని వారన్నారు. కాంగ్రెసును అధికారం నుంచి దించగలిగే శక్తి, విధివిధానాలు తమ వద్ద మాత్రమే ఉన్నాయని, ఇందుకు రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారని వారన్నారు. తొలిసారి ప్రజారాజ్యం పార్టీ ప్రతినిధులు కాస్తా తీవ్రంగా ప్రతిస్పందించారు.

తాము పార్టీ పెట్టిన తర్వాత తమ విధివిధానాలపై సిపిఎం నాయకులు ఆసక్తి చూపారని, వాటిని వివరించేందుకే తాము బుధవారం సిపిఎం నాయకులను కలిశామని వారు వివరణ ఇచ్చారు. పొత్తుల ప్రస్తావన గానీ, తెలంగాణ అంశం గానీ తమ చర్చల్లో రాలేదని వారు చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాలో తమకు ఒకటి, రెండు సీట్లు తగ్గుతాయేమోనని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రకటనపై వారు తీవ్రంగా ప్రతిస్పందించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తాము ప్రతి సీటూ 20 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెసుకు పడిన ప్రతి ఓటూ, కాంగ్రెసు గెలిచిన ప్రతి సీటూ తమకు కావాలని వారన్నారు. ఎరువుల పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు. అణు ఒప్పందంపై ప్రధాని స్పందించాలని వారు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+