కాశిపేట లింగయ్య నకిలీ భార్య అరెస్టు
హైదరాబాద్: మనుషుల అక్రమ రవాణా కేసులో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు సంగీతాబెన్ అనే మహిళను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. శాసనసభ్యుడు కాశిపేట లింగయ్య భార్యగా చెప్పుకుని అమెరికా కాన్సులేట్ కు వెళ్లిన మహిళ సంగీతా బెన్ కోసం చాలా కాలంగా హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. కాశిపేట లింగయ్యను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సంగీతను పోలీసులు గుజరాత్ లోని కల్లోల్ జిల్లాలో అరెస్టు చేశారు.
విచారణ నిమిత్తం సంగీతా బెన్ ను హైదరాబాద్ తరలిస్తున్నారు. భరత్ భాయ్ ద్వారా తనకు కాశిపేట లింగయ్య పరిచయం జరిగినట్లు సంగీతా బెన్ చెబుతోంది. కాశిపేట లింగయ్య విచారణలో చెప్పిన విషయాల మేరకు సంగీతా బెన్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే కాశిపేట లింగయ్యతో పాటు రషీద్, భరత్ భాయ్ లను పోలీసులు అరెస్టు చేశారు. కాశిపేట లింగయ్య భార్యగా అమెరికా కాన్సులేట్ కు వెళ్లిన స్త్రీని ముందు తారగా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు తార కోసం గాలిస్తున్నట్లు సమాచారం. తార పట్టుబడితే కేసులో చార్జీషీట్ వేయడానికి వీలుంటుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications
