ముద్రా పథకానికి కొత్త ఊపిరి! రూ.62,370 కోట్ల ఎరువుల సబ్సిడీకి క్యాబినెట్ ఓకే!

రైతు శ్రేయస్సే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం మరో బృహత్తర నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. రాబోయే రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి కొరత లేకుండా సరసమైన ధరలకే ఎరువులు అందించేందుకు వీలుగా ఏకంగా రూ.62,370 కోట్ల భారీ సబ్సిడీకి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో వ్యవసాయ రంగానికే కాకుండా, చిన్న పరిశ్రమల ప్రోత్సాహానికి, దేశ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను వెల్లడించారు.

రబీ పంటలకు కొండంత అండ.. రూ.62,370 కోట్ల సబ్సిడీ

అక్టోబర్ నుంచి మార్చి వరకు సాగే రబీ కాలంలో గోధుమ, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి పంటలను రైతులు విస్తారంగా సాగు చేస్తారు. ఈ సమయంలో రైతులకు ప్రాథమిక ఎరువులైన భాస్వరం, పొటాష్ ఎరువులు భారం కాకుండా చూసేందుకు న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ (ఎన్‌బీఎస్) విధానం కింద ఈ రూ.62,370 కోట్లను కేటాయించారు.

Union Cabinet Approves 62 370 Crore Fertiliser Subsidy and 5 000 Crore Guarantee Fund for MUDRA Scheme

అంతర్జాతీయంగా ఎరువుల ముడి సరుకుల ధరలు పెరిగినప్పటికీ, ఆ భారం రైతులపై పడకుండా నేరుగా తయారీదారులు, దిగుమతిదారులకు ప్రభుత్వం ఈ నిధులను అందిస్తుంది. గత రబీ సీజన్‌లో కేటాయించిన రూ.37,952 కోట్లు, ఖరీఫ్ సీజన్‌లోని రూ.41,534 కోట్లతో పోలిస్తే ఈసారి ప్రభుత్వం నిధులను గణనీయంగా పెంచడం విశేషం.

ముద్రా రుణాలకు కొలేటరల్ ఫ్రీ రక్షణ.. రూ.5,000 కోట్ల క్రెడిట్ గ్యారెంటీ

చిన్న వ్యాపారులు, సూక్ష్మ పరిశ్రమలు స్థాపించే వారికి ఎలాంటి షూరిటీలు లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు అందించే 'ప్రధాన్ మంత్రి ముద్రా యోజన'కు క్యాబినెట్ మరింత ఊపిరి ఊదింది. ముద్రా రుణాల క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ కోసం రూ.5,000 కోట్లను ఆమోదించింది.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో రిలయన్స్ డేటా సెంటర్ కు ఆమోదం.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలివే!
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో రిలయన్స్ డేటా సెంటర్ కు ఆమోదం.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలివే!

బ్యాంకులు , ఇతర ఆర్థిక సంస్థలు చిన్న వ్యాపారులకు రుణాలు ఇచ్చే సమయంలో ఎదురయ్యే డిఫాల్ట్ నష్టాల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయి. దీనివల్ల ఎలాంటి పూచీకత్తు లేకపోయినా బ్యాంకులు చిన్న వ్యాపారులకు మరింత ధైర్యంగా రుణాలు మంజూరు చేయడానికి మార్గం సుగమమైంది.

పారిస్ లూవ్రే కంటే పెద్ద మ్యూజియం.. నార్త్, సౌత్ బ్లాక్‌లకు నూతన రూపం!

ఢిల్లీలోని చారిత్రాత్మక నార్త్, సౌత్ బ్లాక్ భవనాలను ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 'యుగే యుగీన్ భారత్ మ్యూజియం'గా మార్చేందుకు క్యాబినెట్ కమిటీ రూ.3,230 కోట్లను ఆమోదించింది. ఈ మ్యూజియం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రముఖ 'లూవ్రే మ్యూజియం' కంటే ఎంతో పెద్దదిగా ఉండబోతోందని మంత్రి వెల్లడించారు.

జాగ్రత్తగా ఉండాలి, మన టార్గెట్ అదే - మంత్రులకు తేల్చి చెప్పిన చంద్రబాబు..!!
జాగ్రత్తగా ఉండాలి, మన టార్గెట్ అదే - మంత్రులకు తేల్చి చెప్పిన చంద్రబాబు..!!

దాదాపు 1.79 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ మ్యూజియం రోజుకు 30 వేల మంది సందర్శకులకు సరిపోయేలా డిజైన్ చేస్తున్నారు. భారతదేశ శతాబ్దాల నాటి సంస్కృతి, నాగరికతను చాటిచెప్పేలా 18 లక్షల అరుదైన కళాఖండాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. 2027 నుంచి 2031 మధ్య దశలవారీగా ఈ మ్యూజియం అందుబాటులోకి రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+