నేను అందరివాడిని: చిరంజీవి
హైదరాబాద్: రాజకీయాల్లో తాను ఒంటరివాడిని కానని, అందరివాడినని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ఐఎఎస్ అధికారి చంద్రశేఖర్ మంగళవారం ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తాను ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నానని, పరుగులు పెడతానని, అందరూ చేయూత ఇస్తే ఎవరికీ అందకుండా పోతానని ఆయన అన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ ప్రజారాజ్యం పార్టీలో చేరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన జగ్గంపేట నుంచి హైదరాబాదుకు ర్యాలీగా బయలుదేరారు.












Click it and Unblock the Notifications