అలాగైతే సరిపోదు: జయతో ఎంఎన్ఎస్

తాను చేసిన మరాఠీ వ్యతిరేక వ్యాఖ్యలకు గాను సమాజ్ వాదీ పార్టీ పార్లమెంటు సభ్యురాలు, సినీ నటి జయబాధురి క్షమాపణలు చెప్పారు. ఇటీవల ద్రోణ చిత్ర ఆడియో క్యాసెట్ విడుదల కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి, శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బచ్చన్ కుటుంబ సినిమాలను ముంబయిలో ఆడనివ్వబోమని ఎంఎన్ఎస్ నాయకుడు రాజ్ థాకరే హెచ్చరించారు. తాము హిందీ మాట్లాడడానికే ఇష్టపడతామని, తాము యుపివాలాలమని జయబాధురీ అన్నారు. దీంతో శివసేన, ఎంఎన్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేశాయి.
మరాఠీల మనస్సును నొప్పించే ఉద్దేశం తనకు లేదని జయాబచ్చన్ అన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, హిందీ సినిమాల్లో నటిస్తూ ఆంగ్లంలో మాట్లాడుతున్నవారిని ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేశానని, మరాఠీలను ఉద్దేశించి కాదని ఆమె ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. తాను ముంబయిని గానీ ముంబయి ప్రజలను గానీ అవమానించే లేనని, తనకు సర్వం ఇచ్చిన ముంబయి పట్ల తాను అలా ఎలా వ్యవహరిస్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications