ఇక షారూఖ్ పై శివసేన ధ్వజం

షారూఖ్ కు ప్రాంతీయ భావన ఉన్నప్పుడు అదే ఎంతో కొంత తమకు ఉంటే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. గత ఆరు దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలో హిందీ వ్యతిరేకోద్యమం సాగుతోందని, తమిళనాడులో హిందీ సినిమాలపై, హిందీ వార్తలపై నిషేధం ఉందని, అస్సాంలో హిందీ మాట్లాడిన వారిని హత్య చేశారని ఆయన గుర్తు చేశారు. తాము యుపి నుంచో, బీహార్ నుంచో వచ్చామని చెప్పుకుంటున్నవారు హిందీ బ్యానర్ ను వదులుకోరని ఆయన అన్నారు. అమితాబ్ బచ్చన్ ఈ ప్రాంతానికి గానీ, భాషకు గానీ చెందినవారు కారని, తన కళకు వచ్చే సరికి ప్రాంతీయత, భాష వంటి అడ్డుగోడలు పని చేయడం లేదని, అమితాబ్ అంత గొప్ప నటుడని ఆయన అన్నారు. అయితే అమితాబ్ భార్య తాము ఉత్తరప్రదేశ్ వాసులమని అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications