నేను నవ్వితే బాబుకు బాధ: వైయస్

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులుపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. తామంటే రాఘవులుకు కోపం ఏర్పడవచ్చు, చంద్రబాబంటే ప్రేమ ఎందుకు పెరిగిందో తెలియడం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు ఆలోచనా ధోరణి ఏ మాత్రం మారలేదని, అయినా రాఘవులు చంద్రబాబును ఎందుకు ప్రేమిస్తున్నారని ఆయన అన్నారు. తాము కరెంట్ చార్జీలను పెంచలేదని ఆయన చెప్పారు. చంద్రబాబు 9 పాలనలో ఐదు సార్లు కరెంట్ చార్జీలు పెంచారని ఆయన విమర్శించారు. ఇటువంటి స్థితిలో రాఘవులు తెలుగుదేశం పార్టీని ప్రేమించడమేమిటని ఆయన అన్నారు. తామంటే ఇష్టం లేకపోతే రాఘవులు తటస్థంగా ఉండాలని, కానీ సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి చంద్రబాబుతో కలవడానికి సిద్ధపడడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications