జయ వ్యాఖ్యలపై అమితాబ్ వివరణ

Amitabh Bachchan
ముంబయి: జయా బచ్చన్ వివాదాస్పద వ్యాఖ్యలు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కష్టాలు తెచ్చి పెట్టాయి. ఈ విషయంలో తన బాధను వ్యక్తం చేస్తూ తన బ్లాగులో రాసుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు జయ క్షమాపణలు చెప్పినట్లు తనకు ఫాక్స్ ద్వారా అందిన వార్తా కథనం చూసి సంతోషించానని లండన్ లో ఉన్న అమితాబ్ అన్నారు. విషయం తెలియగానే తాను జయకు ఎస్ఎంఎస్ పంపినట్లు ఆయన తెలిపారు. ద్రోణ ఆడియో క్యాసెట్ విడుదల కార్యక్రమంలో జయ మరాఠీల మనోభావాలను దెబ్బ తీసే వ్యాఖ్యలు చేసి ఉంటే క్షమాపణలు చెప్పాలని తాను సూచించినట్లు ఆయన తెలిపారు.

తాము ఎప్పుడు కూడా మహారాష్ట్ర పట్ల అగౌరవాన్ని ప్రదర్శించలేదని ఆయన స్పష్టం చేశారు. ఒక వేళ తెలియకుండా ఆ పని చేసి ఉంటే తాము క్షమాపణ చెప్తామని, తాము విచారం వ్యక్తం చేస్తామని, మనోభావాలు దెబ్బ తిన్నవారి నుంచి క్షమాపణలు కోరుతామని ఆయన అన్నారు. తాను మరాఠీ ప్రయోజనాల కోసం ఎన్నో చేశానని ఆయన చెప్పుకున్నారు. తన మేకప్ మ్యాన్ దీపక్ సావంత్ మరాఠీ వ్యక్తి అని, గత 35 ఏళ్లుగా తనతో ఉంటున్నాడని ఆయన చెప్పారు. దీపక్ సావంత్ మరాఠీలో నిర్మించిన రెండు సినిమాలకు తనతో పాటు జయ పనిచేసినట్లు ఆయన తెలిపారు. బోజ్ పురిలో కూడా అతను రెండు సినిమాలు తీశాడని, డబ్బులు తీసుకోకుండా తాను పనిచేశానని అమితాబ్ చెప్పారు.

మరాఠీ చిత్రం శ్వాస్ ఆస్కార్స్ కు ఎంపికైనప్పుడు లాస్ ఏంజెల్స్ కు వెళ్లడానికి నిర్మాతల వద్ద డబ్బు లేకపోతే తాను 11 లక్షల రూపాయలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తన ప్రొడక్షన్ కంపెనీ ఎబి కార్పోరేషన్ ద్వారా మరాఠీలను ప్రోత్సహిస్తున్నానని ఆయన చెప్పుకున్నారు. అటువంటి ప్రాజెక్టుల్లో ఒకదానికి జయ రూపకల్పన చేసిందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+