రోడ్డు ప్రమాదాల్లో 7గురు మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 7గురు మరణించారు. రాజమండ్రిలోని మోరంపూడి జంక్షన్ లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పక్కనే వస్తున్న ఆటోపై లారీ అదుపు తప్పి పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. లారీలోని బస్తాలు ఆటోపై పడ్డాయి. దీంతో ఆటో నుజ్జు నుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురు మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లా పొట్లమర్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వరణించారు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.












Click it and Unblock the Notifications