గుజరాత్ పేలుళ్లు:తిరిగి వచ్చిన హేవుడ్
ముంబయి: అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో అనుమానితుడు కెన్నెత్ హేవుడ్ బుధవారం రాత్రి ముంబయికి తిరిగి వచ్చాడు. అహ్మదాబాద్ పేలుళ్లకు ఐదు నిమిషాల ముందు ఇతని మెయిల్ నుంచి ఉగ్రవాద దాడులకు సంబంధించిన ఇ-మెయిల్ వెళ్లింది. నెల క్రితం అతను ముంబయి నుంచి కనిపించకుండా పోయాడు. హేవుడ్ లండన్ లోని ఒక విమానాశ్రయంలో బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానంలో ఎక్కి బుధవారం అర్థరాత్రి ప్రాంతంలో ముంబయి చేరుకున్నట్లు సమాచారం.
తనకు నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహిస్తారనే భయంతో అతను ముంబయి నుంచి పారిపోయినట్లు చెబుతున్నారు. ఇక్కడి నుంచి పారిపోయిన హేవుడ్ అరిజోనాలోని నివాసంలో విశ్రాంతి తీసుకున్నట్లు, ఇతరులు తనను అనుమానంగా చూడడం నుంచి తప్పించుకోవడానికే అలా చేసినట్లు చెబుతున్నారు. ముంబయిలో పామన్ బీచ్ రోడ్డులో గల సంపదలో గల అతని 15వ అంతస్థు ఫ్లాట్ అతని కుటుంబ సభ్యుల కోసం సిద్ధమవుతోంది. ఆ ఫ్లాట్ పై నవి ముంబయి పోలీసు కమిషనరేట్ అధికారులు నిఘా పెట్టారు.
ఆగస్టు 17వ తేదీన పోలీసులు అతన్ని విచారించాల్సి ఉండిందని, అయితే అంతకు ముందే హేవుడ్ అతని కుటుంబ సభ్యులతో అమెరికాకు పారిపోయాడు. న్యూఢిల్లీకి దేశీ విమానంలో వెళ్లి, అక్కడి నుంచి వారు అమెరికాకు అర్థరాత్రి చెక్కేశారు. అతనికి సంబంధించిన నోటీసులు అంతర్జాతీయ విమాశ్రయాలకు ఇచ్చినప్పటికి అతను పారిపోవడంలో ఫలితం సాధించాడు












Click it and Unblock the Notifications