రాజగోపాల్ రెడ్డి తేల్చేసారు, ఇక నుంచి..!!
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన లక్ష్యం ఏంటో స్పష్టం చేసారు. తన రాజకీయ కార్యాచరణ పైన తేల్చి చెప్పేసారు. మంత్రి పదవి దక్కలేదనే కారణంతో ఆగ్రహంగా ఉన్న రాజగోపాల్ రెడ్డి కొంత కాలంగా పలు వ్యాఖ్యలు చేసారు. పార్టీలోనూ చర్చకు కారణమయ్యారు. తనకు హామీ ఇచ్చి మంత్రి పదవి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తాజాగా సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారు. పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీతో భేటీ తరువాత రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ లక్ష్యం స్పష్టం చేసారు.
వరుసగా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీ కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తున్నానని.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రజల మనసులో ఏమున్నది వాళ్ళకి ఏం చేయాలనే దానిపైన ఆలోచన చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాం పార్టీని బలోపేతం చేసే విషయంలో రాజీ పడమని స్పష్టం చేసారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి అన్యాయం జరుగొద్దనేదే తమ ఆలోచనగా పేర్కొన్నారు. యాదగిరిగుట్ట విషయం తప్పనిసరి పరిస్థితులలో మాట్లాడాల్సి వచ్చింది అది పార్టీ మీద వ్యతిరేకమో ప్రభుత్వం మీద వ్యతిరేకమో కాదని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని.. వచ్చే ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తాను పని చేస్తానని వెల్లడించారు.

రాహుల్ ను ప్రధాని చేయటమే లక్ష్యంగా
అదే విధంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని రాజ గోపాల్ రెడ్డి స్పష్టం చేసారు. తాను పార్టీకి దూరంగా ఉంటున్నానన్న మాటల్లో వాస్తవం లేదని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటున్నానని వివరించారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని నిర్ణయాలను తప్పుపడుతున్నాను మినహా.. పార్టీని కాదని స్పష్టత ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ నాయకునికి రాహుల్ గాంధీ అంత సమయం ఇచ్చింది లేదని.. తనకు పార్టీ లో ఆ స్థానం ఉందని చెప్పుకొచ్చారు . రాహుల్ గాంధీతో పార్టీ నిర్ణయాలు, కుటుంబ విషయాలు చాలా చర్చించాని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. దీని ద్వారా రాజగోపాల్ మనసు మార్చుకున్నారని.. కాంగ్రెస్ లోనే కొనసాగుతారనేది స్పష్టం అవుతుందనే వాదన పార్టీ నేతల్లో వినిపిస్తోంది.













Click it and Unblock the Notifications