టిడిపి విజయానికి పని చేస్తా: బాలకృష్ణ

గుంటూరులో జరిగే యువగర్జన సదస్సులో తాను పాల్గొంటానని ఆయన చెప్పారు. తన తండ్రి ఆశయాల కోసం తాను కృషి చేస్తానని ఆయన అన్నారు. మానవ సేవే మాధవ సేవగా తన తండ్రి భావించారని, పేదలకు మేలు చేసే లక్ష్యం తో పని చేశారని, అందుకు తాను కృషి చేస్తానని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐటి వంటి రంగాలు అభివృద్ధి చెంది, రాష్ట్రానికి చెందిన యువకులు ఎంతో మంది విదేశాల్లో గౌరవప్రదంగా జీవిస్తున్నారని, రాష్ట్రంలోని ఇంటికొక్కరికి ఉద్యోగం లభించిందంటే అది తెలుగుదేశం కృషేనని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం తాను చేపట్టబోయే ప్రచార కార్యక్రమ వివరాలను ఇప్పుడే వెల్లడించలేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications