ఒప్పందాన్ని కాంగ్రెస్ కు పంపిన బుష్

George Bush
వాషింగ్టన్: అమెరికా, భారత్ అణు ఒప్పంద పాఠాన్ని ఆమోదం కోసం అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ కాంగ్రెసుకు పంపారు. అణు సరఫరా దేశాలు భారత్ తో అణు వ్యాపారం చేయడానికి అవసరమైన మినహాయింపులకు ఆమోద ముద్ర వేసిన ఐదు రోజుల తర్వాత బుష్ ఆ ఒప్పందాన్ని అమెరికా కాంగ్రెసుకు పంపారు. అమెరికా కాంగ్రెసు ఆమోదిస్తే పౌర అణు సహకారం అమలులోకి వస్తుంది.

భారత రక్షణ మంత్రి ఎ.కె. ఆంధోనీ అమెరికా మంత్రి కండోలిజా రైస్ ను, జాతీయ భద్రతా సలహాదారు స్టీఫెన్ హాడ్లీని కలిసిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. అమెరికా కాంగ్రెస్ ఈ నెల 26వ తేదీన వాయిదా పడుతుంది. ఇచ్చిన హామీ మేరకు ఈ లోగానే భారత్ తో అణు ఒప్పందాన్ని బుష్ కాంగ్రెసుకు పంపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+