సత్యంబాబే నిందితుడు: రాజేంద్రనాథ్
విజయవాడ: విజయవాడలోని ఒక హాస్టల్ విద్యార్థిని అయేషా హత్య కేసులో నిందితుడు సత్యంబాబేనని విజయవాడ పోలీసు కమీషనర్ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. శాస్త్రీయంగా జరిపిన ఎఫ్ఎస్ఎల్ పరీక్షల్లో సత్యంబాబే నిందితుడని తేలుతోందని ఆయన గురువారం మీడియాతో అన్నారు. పాదముద్రలు, చేతిరాత, డిఎన్ఎ పరీక్షలు సత్యంబాబే నిందితుడని తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు.
ఎఫ్ఎస్ఎల్ నివేదికపై, డిఎన్ఎ పరీక్షల నివేదికపై నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుని వాటిని కోర్టుకు సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఆధారాలు లేకుండా అయేషా కేసులో ఆరోపణలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అయేషా హత్య కేసులో మంత్రి కోనేరు రంగారావు మనవడిపై ఆమె తల్లిదండ్రులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications