స్పష్టత అంటే ఏమిటి: చిరంజీవి

Chiranjeevi
హైదరాబాద్: సామాజిక సమస్యలపై తనకు స్పష్టత ఉందని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. ఇమేజ్ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన బుధవారం సాయంత్రం మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుంచి తనకు స్పష్టత లేదనే విమర్శలు వస్తున్నాయని ఆయన అంటూ స్పష్టత అంటే ఏమిటని ప్రశ్నించారు. పేదల బాధలపై తనకు స్పష్టత ఉందని, విదేశాలతో పోల్చుకుంటే మన దేశం వెనకబడి ఉందని స్పష్టత ఉందని, దేశం రూపురేఖలు మార్చే విషయంలో స్పష్టత ఉందని ఆయన అన్నారు. ప్రజల నుంచి తమ ఎన్నికల ప్రణాళిక రూపొందుతుందని ఆయన అన్నారు. తనకు స్పష్టత లేదనడంలో అర్థం లేదని ఆయన అన్నారు.

సమస్యల పరిష్కారానికి ప్రజలు తనను రాజకీయాల్లోకి ఆహ్వానించారని ఆయన చెప్పుకున్నారు. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తికి తన ద్వారా సమాధానం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలకు న్యాయం జరగడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని, ఆ రోజు దగ్గర్లోనే ఉందని, ప్రజలు ఆ భరోసా ఇచ్చారని ఆయన అన్నారు. కొన్ని వారాల్లో అన్ని ప్రాంతాలకు వస్తానని, ప్రతి ఒక్కరిని పలకరిస్తానని, ప్రతి ఇంటి గడప తొక్కుతానని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+