రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వేతనాల పెంపు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్ల వేతనాలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీల జీతాలతో పాటు రాష్ట్రగవర్నర్ల వేతనాలు 300 శాతం పెరిగాయి. ప్రస్తుతం 50 వేల రూపాయలున్న రాష్ట్రపతి వేతనాన్ని లక్షన్నర రూపాయలకు పెంచారు. ప్రస్తుతం 40 వేల రూపాయలున్న ఉపరాష్ట్రపతి వేతనాన్ని లక్షా 25వేల రూపాయలకు పెంచారు. గవర్నర్ల వేతనాలను 36 వేల రూపాయల నుంచి లక్షా పది వేల రూపాయలకు పెంచారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల వేతనాలను పెంచుతూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గురువారం నిర్ణయం తీసుకుంది. మాజీ రాష్ట్రపతులు, మాజీ ఉప రాష్ట్రపతులు, వారి సతీమణులు పదవీ విరమణ తర్వాత పొందే ప్రయోజనాలను కూడా హేతుబద్దం చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. పెరిగిన వేతనాలు ఈ ఏడాది జనవరి నుంచే అమలవుతాయని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+