అమితాబ్ పై చల్లబడిన రాజ్ థాకరే
ముంబయి: సమాజ్ వాదీ పార్టీ పార్లమెంటు సభ్యురాలు, సినీనటి జయాబచ్చన్ చేసిన వ్యాఖ్యలపై గుర్రుమన్న మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) నేత రాజ్ థాకరే ఆమె భర్త అమితాబ్ బచ్చన్ చెప్పిన క్షమాపణలను శాంతించారు. అమితాబ్ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అమితాబ్ చెప్పిన క్షమాపణలను అంగీకరిస్తున్నట్లు ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో గురువారం తెలిపారు.
అమితాబ్ బ్లాగ్ గురించి ఎవరికీ తెలియదని, అందువల్ల అది ఎవరికీ ఆమోదయోగ్యం కాదని, బహిరంగంగా విలేకరుల సమావేశంలో అమితాబ్ క్షమాపణలు చెప్పినందున దాన్ని తాను అంగీకరిస్తున్నానని ఆయన వివరించారు. ద్రోణ ఆడియో క్యాసెట్ విడుదల కార్యక్రమంలో జయాబచ్చన్ చేసిన వ్యాఖ్యపై రాజ్ థాకరే నిప్పులు చెరిగారు. అమితాబ్ కుటుంబ సభ్యుల సినిమాల ప్రదర్శనను అడ్డుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. తాను నటించిన దలాస్ట్ లియర్ సినిమా ప్రమోషన్ కోసం గత సాయంత్రం అమితాబ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. జయా బచ్చన్ తరఫున ఆయన ఆ విలేకరుల సమావేశంలో క్షమాపణలు చెప్పారు.












Click it and Unblock the Notifications