హామీలు మరిచిన చరిత్ర టిడిపిది: సోనియా
అనంతపురం: ఇచ్చిన హామీలు విస్మరించిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని, అమలు చేసిన ఘనత ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. అనంతపురంలో గురువారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. పేదరిక నిర్మూలనకు తమ అంకిత భావం, చిత్తశుద్ధి శంకించలేనిదని ఆమె అన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు సాధిస్తున్న సాధికారతలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని ఆమె ప్రశంసించారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు నిశ్శబ్ద విప్లవాన్ని సాధిస్తున్నారని ఆమె అన్నారు. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని ఆమె కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్నన్ని కార్యక్రమాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదని ఆమె అన్నారు. సాగునీ టి ప్రాజెక్టుల ద్వారా అనంతపురం జిల్లాకు సాగునీరందించే ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఆమె ఆమె చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణాల మాఫీ పథకాన్ని ఆమె వివరిస్తూ అనంతపురం జిల్లాలో అ పథకం కింద 2 లక్షల 80 వేల మంది రైతులు ప్రయోజనం పొందినట్లు ఆమె తెలిపారు. రైతు ప్రయోజనాల కోసం తమ పార్టీ కట్టుబడి ఉందని ఆమె చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో అనంతపురం జిల్లా అగ్రస్థానంలో ఉందని ఆమె చెప్పారు.
అమెరికాతో చేసుకున్న ఒప్పందాన్ని ఆమె చారిత్రకమైందిగా కొనియాడారు. అగ్రదేశాలకు ధీటుగా మన దేశం అభివృద్ధి చెందడానికి విద్యుచ్ఛక్తి అవసరమని, విద్యుచ్ఛక్తి అవసరాలు తీర్చడానికి, తద్వారా అభివృద్ధి చెందడానికి అణు ఒప్పందం ఉపయోగపడుతుందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications