పేదరికం అడ్డు రావద్దు: సోనియా

రాజీవ్ గాంధీ శాస్త్రీయ, సాంకేతిక రంగాల అభివృద్ధికి కలలు కన్నారని. ఐటి వంటి ఆధునికసాంకేతిక విద్యలు రాజీవ్ దృక్పథం వల్లనే అందుబాటులోకి వచ్చాయని ఆమె అన్నారు. రాజీవ్ దృక్పథం, అంకిత భావం ఇవాళ ఫలితాలను అందిస్తోందని ఆమెఅన్నారు. దేశంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు పెద్ద యెత్తున పెరిగాయని ఆమె చెప్పారు. సామాజిక సాధికారతకు విద్య అత్యవసరమని ఆమె అన్నారు.
రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం ఏర్పాటు సందర్భంగా తాను ఎంతో ఉద్వేగానికి లోనవుతున్నానని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు పట్టం కట్టడమే త్రిపుల్ ఐటిల స్థాపన లక్ష్యమని ఆయన అన్నారు. ఐటి అభివృద్ధి రాజీవ్ గాంధీ చలువేనని ఆయన అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ, ఐటి మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications