చిరుతో కాంగ్రెసుకు చెమటలు: రామచంద్రయ్య

చిరంజీవికి లభిస్తున్న ఆదరణ చూసి కాంగ్రెసు నాయకులకు చెమటలు పడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. స్వర్గీయ ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు ఇదే విధంగా మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. దిక్కు తోచక రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పర్యటనల కోసం బతిమిలాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రామచంద్రయ్య చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యంలో చేరుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications