ఆ రెండు పార్టీల్లో నియంత పాలన: దేవేందర్

T Devender Goud
కరీంనగర్‌: కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల్లో నియంతల పాలన సాగుతోందని నవ తెలంగాణ ప్రజా పార్టీ (ఎన్టీపిపి)అధ్యక్షుడు దేవేందర్‌గౌడ్‌ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ యాత్ర చేపట్టిన ఆయన కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో సామాన్యులకు చోటులేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ నేతల ఆటలు సాగవని ఆయన అన్నారు. సోనియా సభలకు జన సమీకరణ కోసం అధికారాన్ని కాంగ్రెస్‌ అధికారాన్ని దుర్వినియోగం చేసిందని ఆయన విమర్శించారు.

అధికార దుర్వినియోగంతో ప్రజలను సమీకరించి ప్రజలంతా తమవైపే ఉన్నారని కాంగ్రెసు నాయకులు అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అదే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో కూడా ఉందన్నారు. ప్రజారాజ్యంలో సామాజిక న్యాయం ఎలా అమలుచేస్తారో చూడాలని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంలో తొందరపడేది లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+