భారీ వర్షాలు: వరంగల్ జిల్లా జలమయం
హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తెలంగాణా, పరిసర ప్రాంతాలమీద ఆవరించి ఉంది. దీని ప్రభావం మరో 24 గంటలు ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణా కోస్తా ఆంధ్రలో పలుచోట్ల వర్షాలు పడతాయని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమలో కూడా కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు. హైదరాబాద్ లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పలు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రామంతపూర్ లోని కొన్ని కాలనీలు, దిల్ షుక్ నగర్ ప్రాంతంలోని పి అండ్ టీ కాలనీ, తదితర ప్రాంత్లాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షం తీవ్ర నష్టం కలిగిస్తోంది.
వరంగల్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో రాకపోకలు స్తంభించాయి. నగరంలో ఎస్సార్‌నగర్, సమ్మయ్యనగర్ కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. హన్మకొండనుంచి ములుగు వెళ్లే జాతీయ రహదారిపై జవహర్‌నగర్ వద్ద రోడ్డుకు గండి పడటంతో ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేటలకు రాకపోకలు నిలిచిపోయాయి. పరకాల-భూపాలపల్లి మధ్య మోరంచవాగు పొంగి పొర్లుతుండటంతో కొత్తగూడ తదితర ఏజెన్సీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరోవైపు ఉథృతంగా ప్రవహిస్తున్న వాగులు, చెరువులు అలుగులతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.












Click it and Unblock the Notifications