సోనియావి రాజకీయ సభలు: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సభలకు అధికార దుర్వినియోగం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. అధికారిక సభలను రాజకీయ సభలుగా మార్చి కాంగ్రెసు పార్టీ కొత్త సంప్రదాయానికి నాంది పలికిందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. సోనియాగాంధీ కాంగ్రెసు అధ్యక్షురాలిగా రాజకీయ సభల్లో పాల్గొంటే అభ్యంతరం లేదని, ప్రభుత్వ అధికారిక సభల్లో మాట్లాడడం అధికార దుర్వినియోగమేనని ఆయన అన్నారు. సోనియా గాంధీ రాష్ట్రం కాంగ్రెసు పాలనలో అభివృద్ధి చెందుతోందని, అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉందని సోనియా గాంధీ అనడాన్ని ఆయన తప్పు పట్టారు.

జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని ఆయన విమర్శించారు. చిన్న వర్షాలకే ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయని ఆయన అన్నారు. కోస్తా కారిడార్ కు వేలాది ఎకరాలు కట్టబెట్టి అవినీతికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని ఆయన విమర్సించారు. రైతులు ఆత్యహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. అవేవీ సోనియాగాంధీకి కనిపించకపోవడం విడ్డూరమని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని భయపడే తన మీ కోసం యాత్రను ఎవరి కోసమని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+