యుపిఎ తప్పులను ఎండగడ్తాం: బిజెపి
బెంగుళూర్: కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) తప్పులను తమ పార్టీ ఎండగడుతామని, ప్రభుత్వ తప్పుడు విధానాలపై పెద్ద యెత్తున ప్రచారం చేపడుతామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నక్వీ శుక్రవారం బెంగుళూరులో చెప్పారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతారు.
తమ పార్టీ దేశవ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలను చేపడుతుందని, బెంగుళూర్ లో శనివారం జరిగే మొదటి ర్యాలీని ఉద్దేశించి తమ ప్రధాని అభ్యర్థి ఎల్. కె. అద్వానీ ప్రసంగిస్తారని ఆయన చెప్పారు. తమ పార్టీ 150 ర్యాలీలు నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో విస్తృత ప్రాతిపదికపై ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేస్తుందని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను గుర్తించే పనిని పార్టీ ఇది వరకే ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఇందుకుగాను వివిధ రాష్ట్రాల సీనియర్ నాయకులు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీతో చర్చిస్తున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications