చిరు ఎందుకు రాకూడదు?: అక్కినేని

'మా' నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మురళీమోహన్ కూడా తీవ్రంగా ప్రతిస్పందించారు. సినిమా పరిశ్రమవాళ్లం తలుచుకుంటే ఏమైనా చేస్తామని, ఆ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా నిరూపించామని, తమను తేలికగా తీసుకుని అవాకులు చెవాకులు పేలితే చూస్తూ మిన్నకుండబోమని మురళీమోహన్ అన్నారు. తాము అన్ని పార్టీల్లోనూ ఉన్నామని, కానీ సినిమా పార్టీ అని, తమది సినిమా కులమని, తమను హీనపరిస్తే సహించబోమని, తమ సత్తా ఏమిటో చూపుతామని ఆయన అన్నారు. తమ పెద్దలు తమిళనాడులో, అమెరికాలో, ఆంధ్రప్రదేశ్ లో సత్తా చూపారని ఆయన అన్నారు. తమ జోలికి ఎవరైనా వస్తే శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందేనని ఆయన హెచ్చరించారు.
ఆదివారం హైదరాబాద్ చలనచిత్ర వాణిజ్య మండలి ప్రాంగణంలో 'మా'కు జరిగిన ఎన్నికల్లో మురళీమోహన్ ప్యానెల్ విజయం సాధించింది. మురళీ మోహన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఆహుతి ప్రసాద్, ఉపాధ్యక్షులుగా శ్రీహరి, శ్రీకాంత్, కార్యనిర్వాహక ఉపాధ్యక్షురాలిగా జయసుధ, సంయుక్త కార్యదర్శులుగా గోగినేని మహర్షి, అలీ, కోశాధికారిగా కోట శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications