ఢిల్లీ పేలుళ్ల కేసులో ఖయాముద్దీన్?
అహ్మదాబాద్: ఢిల్లీ వరుస బాంబు పేలుళ్ల వెనక సిమి కార్యకర్త ఖయాముద్దీన్ పాత్రపై పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుళ్లలో అబ్దుల్ సుభాన్ అలియాస్ తాఖీర్ పాత్రతో పాటు ఖయాముద్దిన్ పాత్ర కూడా ఉందని గుజరాత్ పోలీసులు అంటున్నారు. అహ్మదాబాద్ పేలుళ్ల నిందితుల్లో ఖయాముద్దీన్ ఉన్నాడని, ఢిల్లీ పేలుళ్లలో కూడా అతని పాత్ర ఉండవచ్చునని వారంటున్నారు. ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో బాంబులు పెట్టడంలో అతని పాత్ర ఉండి ఉంటుందని వారు చెబుతున్నారు.
ముంబయికి చెందిన కంప్యూటర్ నిపుణుడు అబ్దుల్ సుభాన్ అలియాస్ తాఖీర్ కూడా ఢిల్లీ పేలుళ్లలో పాల్గొని ఉండవచ్చునని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో తప్పించుకుని తిరుగుతున్న సిమి సభ్యుల పాత్ర ఢిల్లీ పేలుళ్లలో ఉండి ఉంటుందని వారంటున్నారు. అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో వారిద్దరి మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చారు. కేరళ, గుజరాత్ లోని హాలోల్ ల్లో జరిగిన ఉగ్రవాద శిక్షణా కార్యక్రమాల్లో ఖయాముద్దిన్ పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ఒక బహుళ జాతి సంస్థలో ఉద్యోగం చేస్తున్న సుభాన్ ఆ ఉద్యోగాన్ని వదిలేసి సిమిలో చేరాడు. అతను కంప్యూటర్ నిపుణుడే కాకుండా బాంబులు తయారు చేయడంలో కూడా నిపుణుడని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications