ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం
హైదరాబాద్: హైదరాబాదులోని గణేష్ నిమజ్జనం సోమవారం ఉదయం ముగిసింది. హైదరాబాదులోని ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనంతో ఈ కార్యక్రమం ముగిసింది. అత్యంత ఎత్తయిన ఈ విగ్రహ నిమజ్జనం సోమవారం ఉదయం జరిగింది. జర్మనీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన క్రేన్ సాయంతో ఈ విగ్రహాన్ని హుస్సేన్ సాగరులో నిమజ్జనం చేశారు. ఆదివారం రాత్రి ఖైరతాబాద్ గణేశుడి ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండువగా ప్రారంభమైంది. ఈ విగ్రహం నిమజ్జనంతో గణేష నిమజ్జన కార్యక్రమం ముగిసింది.
ఆదివారంనాడు హైదరాబాద్, సికింద్రబాద్ జంటనగరాల్లో గణేష్ నిమజ్జనం కార్యక్రమం పెద్ద యెత్తున జరిగింది. హుస్సేన్ సాగరుకు గణేష్ విగ్రహాలు ఒక్కటొక్కటే తరలి వచ్చాయి. భక్తులు పెద్ద యెత్తున వాటిని చూడడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications