రైలు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
హైదరాబాద్: హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రెండు వేర్వేరు ఎంఎంటియస్ రైళ్లు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. పలువురు గాయపడ్డారు. తొలి ప్రమాదంలో సర్ఫరాజ్ ఖాన్ అనే 18 ఏళ్ల యువకుడు మరణించాడు. మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో వారు రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడడంతో ఈ ప్రమాదం సంభవించింది.
మరో రైలు ప్రమాదంలో పి. నాగేశ్వరరావు అనే 26 ఏళ్ల ప్రయాణికుడు మరణించాడు. ఈ ప్రమాదం కూడా నెక్లెస్ రోడ్డులోనే జరిగింది. వేగంగా పోతున్న రైలు నుంచి జారిపడడంతో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. రైళ్లలో రద్దీ విపరీతంగా ఉండడంతో కొంత మంది వేలాడుతూ ప్రయాణించారు. దీంతో ప్రమాదం సంభవించిందని నాంపల్లి రైల్వే పోలీసు ఇన్స్ పెక్టర్ వి. సూర్యచంద్ర చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications