స్పీకరుపై అవిశ్వాసం: వీగిపోయిన తీర్మానం
హైదరాబాద్: స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డిపై తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాలు వీగిపోయాయి. మూజు వాణీ ఓటుతో శాసనసభ స్పీకరుపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాలను ఓడించింది. తీవ్ర గందరగోళం మధ్య అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. ప్రభుత్వ చీఫ్ విఫ్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన అనంతరం అవిశ్వాస తీర్మానంపై సభ ఆమోదానికి సభాద్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ ఉంచారు.
సభ అనంతరం నిరవధికంగా వాయిదా పడింది. తెరాసపై కిరణ్ కుమార్ రెడ్డి తెరాస సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెరాస అసమ్మతి శాసనసభ్యుడు మందాడి సత్యనారాయణరెడ్డికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంతో సభలో రభస మొదలైంది. ఈ గందరగోళం మధ్యనే కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు.












Click it and Unblock the Notifications