నకిలీ నక్సల్స్పై పోలీసుల కాల్పులు
హైదరాబాద్: హైదరాబాద్‌లోని సనత్‌నగర్ సమీపంలో పోలీసులు ఇద్దరు నకిలీ నక్సల్స్‌పై కాల్పులు జరిపారు. నక్సల్స్ పేరుతో ఇద్దరు వ్యక్తులు చందాలకోసం బెదిరిస్తున్నట్లు తమకు సమాచారం అందటంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి నకిలీ నక్సల్స్ డమ్మీ తుపాకి చూపి బెదిరించటంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ప్రసాద్ అనే వ్యక్తి గాయపడగా మరో వ్యక్తి పారిపోయాడు.












Click it and Unblock the Notifications