4,500 మందిపై సత్యం వేటు
హైదరాబాద్: ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ సత్యం తన సిబ్బందిని తగ్గించుకునే ప్రయత్నంలో ఉంది. తన ఉద్యోగుల్లో 4,500 మందిని తొలగించడానికి సత్యం కంపెనీ రంగం సిద్ధం చేసుకుంది. తన ఉద్యోగులు 51 వేల మంది ఉద్యోగుల్లో 1,500 మందిని సంస్థ పెర్ఫామెన్స్ ఇంప్రూవ్ మెంట్ ప్లాన్ కింద పెట్టి వారికి ఉద్వాసన పలికేందుకు సిద్ధపడింది. మరో 3 వేల మందికి ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు. దాంతో వారి సేవలు కూడా అవసరం లేదని చెప్పినట్లయింది. ఈ రకంగా 4,500 మంది ఉద్యోగులను సత్యం వదిలించుకుంటోంది.
సంస్థ చీఫ్ రామలింగరాజు ఉద్యోగులను హెచ్చరిస్తూ శుక్రవారం ఒక ఇ మెయిల్ పంపారు. గతవారం 400 మందికి పింక్ కార్డులు ఇచ్చారు. ఈ ఇ-మెయిల్ వచ్చిన తర్వాత మిగతా 3 వేల మంది కూడా సంస్థను వదిలిపెట్టడం ప్రారంభించారు. సమర్థత చూపని ఐదు శాతం మందిని పిఐపి కింద పెట్టామని, వారికి డమ్మీ ప్రాజెక్టులు ఇచ్చి తమ సమర్థతను రుజువు చేసుకోవాలని చెప్పామని, వారు విఫలమైతే ఉద్వాసన తప్పదని అయితే తమకు చాలా తక్కువ సమయం ఇచ్చారని కొందరు అన్నారని సత్యం అధికార ప్రతినిధి అన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కొత్త వారిని తీసుకునేందుకు సత్యం కంపెనీ ఏర్పాట్లు చేసుకుంటోంది.












Click it and Unblock the Notifications