స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ భారీ పతనం
ముంబయి: ముంబయి స్టాక్ మార్కెట్‌లో సోమవారం ట్రేడింగ్ ఆరంభంలోనే అనేక కంపెనీలు భారీ కుదుపులకు గురయ్యాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా భారీగా కుప్పకూలి 13,224 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 241 పాయింట్లమేర పతనమై 3987 పాయింట్ల వద్ద ఉంది. మార్కెట్ భారీగా నష్టపోవడంతో మదుపుదారుల్లో ఆందోళన నెలకొంది. నిప్టీ ఇటీవల కాలంలో తొలిసారిగా 4వేల పాయింట్ల దిగువకు పడిపోయింది.
నష్టపోయిన కంపెనీల్లో డీఎల్ఎఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, జైప్రకాష్ అసోసియేట్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఓఎన్‌జీసీ, విప్రో, ఎస్‌బీఐ, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఏసీసీ, గ్రాసిం, మహీంద్రా అండ్ మహీంద్రా, లార్సెన్ అండ్ టుబ్రో, రిలయన్స్ ఇండ్, ఐటీసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్ వంటివి ఉన్నాయి.












Click it and Unblock the Notifications