బాలయ్య ఫ్యాన్స్ కు జవాబు
కడప: సినీ నటుడు బాలకృష్ణపై తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని ప్రజారాజ్యం నాయకుడు సి. రామచంద్రయ్య అన్నారు. తన ఇంటి వద్ద బాలకృష్ణ అభిమానులు ధర్నా చేయడంపై ఆయన బుధవారం ఆ విధంగా ప్రతిస్పందించారు. చిరంజీవి స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజారాజ్యం పార్టీని పెట్టారు కాబట్టి ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ఆ పార్టీలో చేరాలని లేదా మరో పార్టీ పెట్టాలని తాను నందమూరి వారసులకు సలహా ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలకు తిలోదకాలిచ్చిన తెలుగుదేశం పార్టీకి సేవలందించడం వల్ల ప్రయోజనం ఉండదని నందమూరి వారసులకు తాను సలహా ఇచ్చానని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి, స్వర్గీయ ఎన్టీఆర్ కూతురు పురంధరేశ్వరి కూడా అదే మాట అంటున్నారని, పురంధరేశ్వరి మాటలనే తాను చెప్పానని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications