చిరంజీవికి మల్లు స్వరాజ్యం చురకలు
హైదరాబాద్: ప్రజారాజ్యం స్థాపించాలనేది ఉమ్మడి కమ్యూనిస్టుల లక్ష్యమని సిపిఎం నాయకురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచనోద్యమ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. పార్టీ పేరే కాదు లక్ష్యాలను కూడా సాధించాలని ఆమె ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి పరోక్షంగా చురకలు అంటించారు. ఎన్టీఆర్ లక్ష్యాలను ముందుకు తీసికెళ్లాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు జాతీయ పతాకను ఆవిష్కరించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలుగుదేశం నిర్వహించడం ఇదే మొదటి సారి. ఈ సందర్భంగా చంద్రబాబు 20 మంది స్వాతంత్ర్య సమరయోధులను సత్కరించారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications