శంషాబాద్ బంగారం దొంగల అరెస్టు
హైదరాబాద్: హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయం వద్ద బంగారం ఉన్న కారును దొంగిలించిన కేసులో హైదరాబాద్ పోలీసులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని పోలీసులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టు చేశారు. వారిని హైదరాబాద్ తీసుకొస్తున్నారు. వారి నుంచి పోలీసులు 20 కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాల నగలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో వీరిని అరెస్టు చేశారు.
హైదరాబాదులోని శంషాబాద్ కార్గో నుంచి బంగారం తెస్తున్న కారును సెప్టెంబర్ 7వ తేదీన దండగులు అపహరించారు. ఈ కారులో నాలుగు బాక్సుల బంగారం ఉంది. ఈ బంగారం హైదరాబాదులోని ఉస్మాన్ గంజ్ కొరియర్ సర్వీసు సంస్థకు ముంబయి నుంచి మరుధర్ కొరియర్ ద్వారా వచ్చింది. బంగారం తెస్తున్న కారును దుండగులు మారుతీ వ్యానులో అనుసరించారు. బంగారం తెస్తున్న కారు డ్రైవరును దుండగులు తుపాకులతో బెదిరించి కారును తీసుకొని పారిపోయారు. అనంతరం కారు సమీపంలోని ఒక గ్రామంలో కనిపించింది.
ఆ కారు నెంబరు 1081 అని చెబుతున్నారు. సంఘటనా స్థలానికి పోలీసు కమీషనరు ప్రసాదరావు చేరుకున్నారు. ఆచూకీ చెప్పిన వారికి 50 వేల రూపాయల నజరానా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అర్పిట్ రాజు గ్యాంగు ఈ దోపిడీకి పాల్పడి వుండవచ్చునని అనుమానిస్తున్నారు. 2005లో కూడా ఉస్మాన్ గంజ్ కు చెందిన ఇదే కొరియర్ సంస్థకు చెందిన 37 లక్షల రూపాయల విలువ చేసే బంగారం దొంగతనం జరిగింది.












Click it and Unblock the Notifications